గద్వాల అర్బన్, జూలై 7 : ‘నీ అంతు చూస్తా.. నీవు బీఆర్ఎస్ కౌన్సిలర్ అయితే ఏం.. కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడివా? సమస్యల గురించి ఎలా అడుగుతావు? నీ కేమీ సంబంధం? వాట్సాప్ గ్రూప్‌లో సమస్యలు, పనుల విషయాలను ఇంకోసారి పోస్టు చేస్తే నీ ఇంటికి వచ్చి మర్డర్ చేస్తా’.. అంటూ అధికార పార్టీ నేత, 22 వార్డు కౌన్సిలర్ భర్త భాస్కర్ 25వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ మోహన్ యాదవ్‌తో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈ నెల 5న జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం తమపై దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గద్వాల టౌన్ ఎస్సై కల్యాణ్‌కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు.