హైదరాబాద్ , ఫిబ్రవరి18(నమస్తే తెలంగాణ) : భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూ వివాదాలకు శాశ్వత పరిషారం చూపేలా.. పకడ్బందీగా భూభారతి చట్టం విధివిధానాలను రూపొందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూభారతి చట్టంపై ఎంసీఆర్హెచ్ఆర్డిలో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న వర్షాప్లో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన విధానాలు, సాంకేతికతను ఉపయోగించుకొని భూభారతిని సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. నూతన చట్టం భూ యాజమాన్య హకులే కాకుండా.. వారి జీవితాల్లో ఆత్మగౌరవం, ఆర్థిక స్వతంత్య్రాన్ని తీసుకువస్తుంది ధీమా వ్యక్తం చేశారు.