10న ‘ఆర్టీసీ గర్జన’.. లేబర్ కమిషనర్‌కు మొరపెట్టుకున్న జేఏసీ సమ్మెకు సహకరించడం లేదని ఆగ్రహం
ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడంలో, యాజమాన్యంతో చర్చలు జరుపడంలో కార్మికశాఖ విఫలమైందని, ఇందుకు నిరసనగా ఈ నెల 10న కార్మికశాఖ ఎదుట ఆర్టీసీ కార్మికులు గర్జన నిర్వహించనున్నట్టు జేఏసీ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు జేఏసీ చైర్మన్ వెంకన్న ఆధ్వర్యంలో ఈయూ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడంలో, యాజమాన్యంతో చర్చలు జరుపడంలో కార్మికశాఖ విఫలమైందని, ఇందుకు నిరసనగా ఈ నెల 10న కార్మికశాఖ ఎదుట ఆర్టీసీ కార్మికులు గర్జన నిర్వహించనున్నట్టు జేఏసీ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు జేఏసీ చైర్మన్ వెంకన్న ఆధ్వర్యంలో ఈయూ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక పక ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ యాజమాన్యానికి తాకట్టు పెడుతూ, మరోపక రీ ఆర్గనేజషన్ యాక్ట్-2014కు తూట్లు పొడుస్తూ బస్ భవన్లో సగభాగాన్ని ప్రభుత్వం ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్ జోన్ కార్మికులను కరీంనగర్, హైదరాబాద్ జోన్లకు బదిలీలు చేసే ప్రక్రియ చేపడుతూనే.. మరోపక మల్టీ ట్రేడ్ సిస్టమ్‌ని తీసుకొచ్చి ఆర్టీసీ కార్మికులను అణగదొకే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిషారం కోసం సహకరించాలని సోమవారం మరో లేఖను జాయింట్ లేబర్ కమిషనర్ సునీతాగోపాల్దాస్కు అందజేశారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే 10 లేబర్ కమిషన్ ఎదుట కార్మిక గర్జన నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ మౌలానా, కో కన్వీనర్లు యాదయ్య, సురేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

