పెద్దపల్లి : గోదావరిఖని ఆర్టీసీ సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR) కు వినూత్న తరహాలో కృతజ్ఞతలు తెలిపారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని హర్షిస్తూ ఆర్టీసీ బస్ డిపోలో కేసీఆర్ (KCR) అనే అక్షరాలతో బస్సులను నిలిపి అభిమానాన్నిచాటుకున్నారు. స్థానిక జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఆర్టీసీ సిబ్బంది కలిసి సుమారు 19 బస్సులను కేసీఆర్ ఇంగ్లిష్ అక్షరాలతో కూడిన అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు.
కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఆర్టీసీ (RTC) కార్మికులు పడుతున్న ఇబ్బందులను చూసిన కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, దానికి అసెంబ్లీ ఆమోదించడంతో వెనువెంటనే జరగడం కార్మికుల పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధిని మరోసారి నిరూపించిందని అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో మరోసారి కేసీఆరే సీఎం అవుతారని వెల్లడించారు. ఈకార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ మిర్యాల రాజి రెడ్డి, సంఘటిత,అసంఘటిత కార్మిక సంఘం నాయకులు పాతిపెల్లి ఎల్లన్న, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.