హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తేతెలంగాణ) : ఆర్టీసీలో ముగ్గురు డిప్యూటీ రీజినల్ మేనేజర్లకు (డీఆర్ఎంలకు) రీజినల్ మేనేజర్ (ఆర్ఎం)లుగా, ఇద్దరు రీజినల్ మేనేజర్(ఆర్ఎం)లకు ఈడీలుగా పదోన్నతి కల్పించారు. కరీంనగర్ జోన్ ఈడీగా పనిచేస్తున్న పీవీ మునిశేఖర్‌ను కార్పొరేషన్ సెక్రటరీ, ఆపరేషన్స్, ఎగ్జిక్యూటివ్, ఐటీ, మెయింటెనెన్స్ విభాగం ఈడీగా, సికింద్రాబాద్ రీజినల్ ఆర్ఎం ఖుస్రోషాఖాన్కు ఈడీగా పదోన్నతి కల్పించి కరీంనగర్ రీజియన్ ఈడీగా నియమించారు.
రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ఆర్ఎం సంతోష్‌కుమార్‌కు పదోన్నతి కల్పించి మహబూబ్‌నగర్ ఆర్ఎంగా, మెదక్ డిప్యూటీ ఆర్ఎం జోత్స్నకు పదోన్నతి కల్పించి నిజామాబాద్ ఆర్ఎంగా, రంగారెడ్డి డిప్యూటీ ఆర్ఎం బీ రాజుకు పదోన్నతి కల్పించి కరీంనగర్ ఆర్ఎంగా బదిలీ చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ రీజినల్ మేనేజర్‌గా పనిచేస్తున్న జానకీరెడ్డిని నల్లగొండకు, నల్లగొండ ఆర్ఎం రాజశేఖర్‌ను సికింద్రాబాద్‌కు, కరీంనగర్ ఆర్ఎం సుచరితను హెచ్ఆర్ ఆర్ఎంగా, మహబూబ్‌నగర్ ఆర్ఎం శ్రీదేవిని బస్‌భవన్ సీఈ (ఐటీ)గా బదిలీ చేస్తూ ఆర్టీసీ వైస్‌చైర్మన్, ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీచేశారు.