హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంతో తేల్చుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సోమవారం హైదరాబాద్‌లోని టీజీఎస్ ఆర్టీసీ జాక్ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. టీజీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యా దయ్య, సుద్దాల సురేశ్, యాదగిరి పాల్గొని ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్న ట్టు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 5న ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.