VC Sajjanar | ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయొద్దు.. ఇబ్బందులకు గురికావొద్దు : వీసీ సజ్జనార్
VC Sajjanar | నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడులకు దిగడం సమంజసం కాదని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని.. అయినా చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు.
VC Sajjanar | నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడులకు దిగడం సమంజసం కాదని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని.. అయినా చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం దాడి జరిగిందంటూ వీడియోను షేర్ చేశారు.
బైకర్ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణమయ్యాడని.. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి.. ఆర్టీసీ హైర్ బైస్ డ్రైవర్‌పై దాడి చేశారన్నారు. దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారన్నారు. ఇలాంటి దాడులను యాజమాన్యం అసలే సహించదన్నారు. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుందని సజ్జనార్ పేర్కొన్నారు.
నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న #TSRTC సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి.… pic.twitter.com/juEpeywb74
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) January 10, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Andole
- Bus driver
- Sangareddy
- TSRTC
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

