Telangana | హన్మకొండ జిల్లా జనగామ ఆర్టీసీ డిపో ఎదుట కండక్టర్లు ఆందోళనకు దిగారు. అకారణంగా కండెక్టర్ శంకర్‌ను సస్పెండ్ చేశారంటూ విధులను బహిష్కరించారు. కండక్టర్ల నిరసనలతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. జనగామ బస్సులోకి ఓ గర్భిణి బస్సు ఎక్కింది. అప్పటికే బస్సు నిండిపోయి ఉండటంతో గర్భిణికి సీటు ఇవ్వాలని ఓ మహిళా ప్రయాణికురాలిని కండక్టర్ శంకర్ కోరాడు. కానీ అందుకు ఆ మహిళా ప్రయాణికురాలు నిరాకరించింది. దీంతో కండక్టర్‌కు, మహిళా ప్రయాణికురాలికి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మహిళా ప్రయాణికురాలు మధ్యలోనే దిగిపోయింది.
మధ్యలోనే బస్సు దిగిన ఆ ప్రయాణికురాలు వెంటనే ఆర్టీసీ అధికారులకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఫిర్యాదు చేసింది. దీనిపై జనగామ డిపో మేనేజర్ స్వాతి స్పందించారు. ఎలాంటి విచారణ జరిపించకుండా సదరు కండక్టర్‌ను విధుల నుంచి తొలగించినట్లు మెమో జారీ చేశారు. దీనిని నిరసిస్తూ డిపో కండక్టర్లు ఆందోళకు దిగారు. కండక్టర్ శంకర్, అతని కుటుంబసభ్యులతో కలిసి జనగామ డిపో ముందు ఆర్టీసీ సిబ్బంది ధర్నాకు దిగారు.
ఫ్రీ బస్సు లొల్లి.. కండక్టర్ సస్పెండ్
హన్మకొండ – జనగామ బస్సులో ఓ గర్భిణికి సీటు ఇవ్వాలని కండక్టర్ ఓ మహిళను కోరాడు.. దీంతో కండక్టర్‌కు, మహిళా ప్రయాణికురాలికి మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలో ప్రయాణికురాలు మధ్యలోనే దిగిపోయింది. ఆర్టీసీ అధికారులకు ఈ విషయాన్ని Xలో ఫిర్యాదు చేసింది..… pic.twitter.com/plSH17RKwr
— Telugu Scribe (@TeluguScribe) August 7, 2024