వట్పల్లి, జనవరి 17: తన ప్రాణాలను లెక్క చేయకుండా..40 మంది ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతిచెందిన ఘటన వట్పల్లి మండల పరిధిలో శనివారం చోటుచేసుకున్నది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సంగారెడ్డి నుంచి వట్పల్లి వస్తున్నది. పల్వట్ల గ్రామ శివారులోకి రాగానే బస్సు డ్రైవర్ జనార్దన్‌కు గుండెలో నొప్పి రావడంతో అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ఒక్కసారిగా కుప్పకూలా డు. కండక్టర్, ప్రయాణికులు వెంటనే 108కి ఫోన్ చేసి జనార్దన్‌ను అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అందోల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన జనార్దన్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.