వేములవాడ, డిసెంబర్ 5: బైక్‌కు సైడ్ ఇవ్వలేదని ఓ యువకుడు ఏకంగా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై దాడికి యత్నించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. వేములవాడ ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు జగిత్యాల నుంచి మొదటి బైపాస్ మీదుగా వేములవాడలోని తిప్పాపూర్ బస్టాండ్ వైపు వస్తున్నది. వెనుకాల వస్తున్న యువకుడు తన బైక్‌కు సైడ్ ఇవ్వలేదని ఆగ్రహించాడు. వేములవాడలో రోడ్డుకు అడ్డంగా తన బైక్‌ను నిలిపి బస్సును అడ్డుకున్నాడు. అప్పటికే అతిగా మద్యం తాగి ఉన్న యువకుడు డ్రైవర్, కండక్టర్లపై తిట్ల పురాణం అందుకోవడమే కాకుండా దాడికి యత్నించాడు.
బాలికపై లైంగికదాడి కేసులో.. నిందితుడికి 20 ఏండ్ల జైలు
కరీంనగర్ కోర్టుచౌరస్తా, డిసెంబర్ 5: బాలికను పెండ్లి పేరిట నమ్మించి, ఆపై లైంగికదాడి చేసిన నిందితుడు మడుపు నరసింహచారికి 20 ఏండ్ల జైలు విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా ఫొక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ శుక్రవారం తీర్పు చెప్పారు. కరీంనగర్ మారుతీనగర్‌లో షెడ్యూల్ తెగకు చెందిన కుటుంబం కిరాయికి ఉంటూ కూలి పని చేసుకుంటున్నారు. వీరికి ఒక అమ్మాయి(12), అబ్బాయి(7) ఉన్నారు. వీరి పకనే మడుపు నరసింహచారి(35)తన తల్లి మణమ్మ(75)తో కలిసి కిరాయికి ఉంటున్నాడు. నరసింహాచారి పెండ్లి చేసుకుంటానని లైంగికదాడి చేశాడని, విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని ఆ బాలిక తెలిపింది.