TSRTC Singareni Darshan | ‘సింగరేణి దర్శన్’ పేరుతో ఆర్టీసీ కోల్‌మైన్స్ టూరిజం ప్యాకేజీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ ‘సింగరేణి దర్శన్' పేరిట ‘కోల్‌మైన్స్ టూరిజం ప్యాకేజీ’ని ప్రారంభించింది. ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీ, కరీంనగర్ బస్టాండ్ నుంచి ఈ టూర్ బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. అండర్‌గ్రౌండ్ బొగ్గు గనులు, ఓపెన్‌కాస్ట్ గనులు, గనుల రెస్క్యూ స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్ల వద్ద విద్యుత్తు తయారీని చూడవచ్చు. సందర్శకులకు స్నాక్స్, మధ్యాహ్న భోజనం ఇస్తారు.
- ప్రతి శనివారం హైదరాబాద్, కరీంనగర్ నుంచి ప్రారంభం
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ ‘సింగరేణి దర్శన్’ పేరిట ‘కోల్‌మైన్స్ టూరిజం ప్యాకేజీ’ని ప్రారంభించింది. ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీ, కరీంనగర్ బస్టాండ్ నుంచి ఈ టూర్ బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. అండర్‌గ్రౌండ్ బొగ్గు గనులు, ఓపెన్‌కాస్ట్ గనులు, గనుల రెస్క్యూ స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్ల వద్ద విద్యుత్తు తయారీని చూడవచ్చు. సందర్శకులకు స్నాక్స్, మధ్యాహ్న భోజనం ఇస్తారు. జేబీఎస్ నుంచి బయలుదేరే పర్యాటకులకు ఒక్కరికి రూ.2 వేలు, కరీంనగర్ బస్‌స్టాండ్ నుంచి ఒక వ్యక్తి రూ.వెయ్యి టూర్ ప్యాకేజీని నిర్ణయించింది. వివరాలకు 040-69440000, 040-23450033, www.tsrtconline లో సంప్రదించాలని సంస్థ కోరింది.
పర్యాటకులకు సూచనలు
ఈ టూర్‌కు వచ్చే వారు 18 ఏండ్లు పైబడి, ఆరోగ్యవంతులైన వారినే సంస్థ అనుమతించనున్నది. మహిళలు కుర్తాలు, జీన్స్, పైజామ వంటి వస్ర్తాలనే దర్శించాలని, షూ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించింది. సంస్థ ఇచ్చే హెడ్‌లైట్ హెల్మెట్ పెట్టుకోవాలి. సూచనలు, సలహాలను పాటించాలి. సందర్శకులు వ్యక్తిగతంగా బాండ్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. గనుల్లోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా ఆధార్‌కార్డ్ జిరాక్స్ ఇవ్వాలని ఆర్టీసీ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

