హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ మార్గమధ్యంలో చేగుంట సమీపంలో మోడల్ స్కూల్ విద్యార్థులు పడుతున్న అవస్థలను చూశారు. వాహనాన్ని నిలిపి.. విద్యార్థుల సమస్యలు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆటో కోసం వేచి చూస్తున్నామని విద్యార్థులు సమాధానమిచ్చారు.
స్పందించిన ఆయన ఆటో ప్రయాణం సురక్షితం కాదని.. ఆటోనిండా ప్రమాదకరంగా తెలిపిన ఆయన.. వెంటనే మెదక్ రీజనల్ మేనేజర్‌కు ఫోన్ చేశారు. చేగుంట మోడల్ స్కూల్ నుంచి నర్సింగ్ మున్సిపల్ పట్టణానికి వెంటనే బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ఆర్టీసీ చైర్మన్ ఆదేశించారు. శుక్రవారం నుంచి విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం, సాయంత్రం సమయంలో బస్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. మోడల్ స్కూల్‌కు బస్సు సౌకర్యం కల్పించినందుకు ఆర్టీసీ చైర్మన్‌కు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు నర్సింగ్ ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.