Free Bus | ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 17 : ఆర్టీసీ బస్సు గాడి తప్పుతున్నది. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్‌తో ఓవర్ లోడ్ సమస్య వేధిస్తున్నది. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వన్‌పల్లి నుంచి సిరిసిల్లకు వెలుతున్న బస్సులో 110 మంది ప్రయాణికులు ఎక్కగా ఓవర్‌లోడ్ కారణంగా అల్మాస్‌పూర్‌లోని మల్లికార్జున స్వామి ఆలయం వద్ద నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పరిమితికి మించి ఎక్కించుకోవడం సరికాదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు.