అచ్చంపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిల్ల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఇప్పలపల్లి గ్రామానికి చెందిన కార్తీక్ రెడ్డి (తండ్రి) గుండె పోటుతో మృతి చెందాడు.
అతడిని చూసేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న అతని పెద్ద కూతురు అనురాధ బైక్ పై ఇంటికి వెళ్తున్న క్రమంలో మద్దిమాడుగు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్ ఉడిమిల్ల సమీపంలోని టర్నింగ్ వద్ద బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అనురాధ అక్కడికక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.