హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ వేములవాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేసింది.
ఈ డీలక్స్ బస్సు ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరుతుంది. సిరిసిల్ల, సిద్దిపేట, జేబీఎస్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. తిరిగి ఎయిర్పోర్టు నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి 10 గంటలకు వేములవాడకు వస్తుంది.