RS Praveen Kumar | హైదరాబాద్ : గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నియామకాలు కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం మిగిలిస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ట్రిబ్ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా కొన్ని డిమాండ్స్ చేశారు.
గతేడాది గురుకుల బోర్డు డిగ్రీ లెక్చరర్, పీజీటీ, టీజీటీ లాంటి అనేక ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేశారు. దీంతో అర్హత కలిగిన వేలాది మంది నిరుద్యోగులు అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాశారు. బోర్డు వెల్లడించిన అన్ని ఫలితాల్లో ఒకే అభ్యర్థి.. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే అభ్యర్థి వివిధ ఉద్యోగాలకు ఎంపిక కావడం వల్ల.. ఎక్కువ ఉద్యోగాలు సాధించిన వ్యక్తి ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంచుకుని మిగతా వాటిని వదిలేశారు. ఫలితంగా ఆ అభ్యర్థి వదిలి వెళ్లిన ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉండిపోవడం వల్ల తర్వాత మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు తీరని నష్టం జరుగుతోంది. బోర్డు తక్షణమే జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి, అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేయాలి. మెరిట్ ఆధారంగా రెండో జాబితా విడుదల చేసి ఖాళీలు లేకుండా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
TREI-RB ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొందరికి మోదం మరికొందరికి ఖేదం మిగిలిస్తుంది.గతేడాది TREI-RB ఖాళీగా ఉన్న DL,JL,PGT, TGT లాంటి అనేక ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేసింది.దీంతో వేలాది మంది నిరుద్యోగులు అర్హత కలిగిన అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని,పరీక్షలు రాసి…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) February 24, 2024