హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ):తెలంగాణలో దేశ్‌ముఖ్ ఆనవాళ్లు మళ్లీ కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్నూరు రామచంద్రారెడ్డి జాగిర్దారీ పాలనకు, రేవంత్‌రెడ్డి పాలనకు తేడాలేదని ధ్వజమెత్తారు.నాడు రామచంద్రారెడ్డిపై పోరాడిన చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో నేడు రేవంత్ సర్కారుపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు నివాళ్లర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రావు ల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు టీ రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు జీ దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, చిరుమళ్ల రాకేశ్ కుమా ర్, కే వాసుదేవ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రచారి, బీఆర్ఎస్ నాయకు లు బొమ్మెర రామ్మూర్తి, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.