బండి.. తడిబట్టలతో ప్రమాణం చెయ్.. బాధితులను బెదిరించలేదా?
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిజం గా హనుమాన్ భక్తుడైతే బాధితులను బెదిరించలేదని తడిబట్టల తో గుడిలో ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లో తలపెట్టిన ఏక్తాయాత్రను ప్రస్తావిస్తూ.. బండి సంజయ్‌కు ఎక్స్ వేదికగా మంగళవారం సూటి ప్రశ్నలు సంధించారు.
- సంజయ్ నిజమైన హనుమాన్ భక్తుడైతే కొడుకును పోలీసులకు అప్పగించాలి
- భక్తి, నిజాయితీని నిరూపించుకోవాలి
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్
హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ) : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిజంగా హనుమాన్ భక్తుడైతే బాధితులను బెదిరించలేదని తడిబట్టల తో గుడిలో ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లో తలపెట్టిన ఏక్తాయాత్రను ప్రస్తావిస్తూ.. బండి సంజయ్‌కు ఎక్స్ వేదికగా మంగళవారం సూటి ప్రశ్నలు సంధించారు. నిజమైన హిందూ భక్తులు కులమతాలకతీతంగా లోకకల్యాణం కోసం పాదయాత్రలు చేస్తుంటే, బండి సంజయ్ కుమారుడు మాత్రం బెంజ్ కార్లలో తిరుగుతూ అరాచకాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ‘ఆంజనేయస్వామి పరస్త్రీని కన్నెత్తి చూడని ఆదర్శప్రాయుడు. కానీ, సాయి భగీరథ్ బాలికపై అఘాయిత్యం చేసి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు?’ అని ప్రశ్నించారు. సంజ య్ తక్షణమే తన కుమారుడిని పోలీసులకు అప్పగించి తన భక్తిని, నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. ఏక్తాయాత్రకు వచ్చే భ క్తులందరూ భగీరథ్ ప్రతిరోజూ ఎకడ తిరుగుతున్నాడు? ఏ పబ్బుల్లో, ఏ హుకా సెంటర్లలో గడుపుతున్నాడు? అనే విషయాలపై బండి సంజయ్‌ను నిలదీయాలని కోరారు.
ఆ ముగ్గురిని సస్పెండ్ చేయాలి
పోక్సో కేసులో మొదటినుంచి నిందితులకే వత్తాసు పలుకుతున్న డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లను తక్షణం సస్పెండ్ చేయాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. బాధితురాలి వాం గ్మూలం రికార్డు చేసిన అనంతరం.. పోక్సో చట్టంలోని సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 సెక్షన్లను జోడించడం సంతోషంగా ఉన్నదని ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. కాగా, బాధితురాలికి న్యాయం చేయకుండా మొదటినుంచి అడ్డుకుంటూ.. ఆ ముగ్గురు పోలీసు అధికారులే కు ట్రలు పన్నుతున్నారని ఆర్ఎస్పీ ఆరోపించా రు. ఈ కేసులో బాధితుల వెర్షన్ వినకుండానే సెక్షన్ 11, 12 పెట్టిన వారు.. కేసు విచారణ కు అర్హులు కారని స్పష్టంచేశారు. డీసీపీ, ఏసీ పీ, ఇన్స్పెక్టర్ దందాలు చేసుకుంటూ బాధితులకు అన్యాయం చేస్తున్నారని, తక్షణం వా రిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లు అక్కడున్నంత కాలం బాధిత బాలికకు న్యాయం జరుగదని అన్నారు. మొదటిరోజే నిందితుడిని అరెస్టు చేసే అవకాశం ఉన్నా.. వాళ్లు కావాలనే వదిలేశారని ఆరోపించారు. ఈ కేసులో బాలిక సాక్ష్యం కీలకం కాబట్టి.. ఆ తర్వాత కోర్టులు అన్నీ చూసుకుంటాయ న్నారు. అయితే, బాధితురాలి స్టేట్మెంట్ను మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎప్పుడో చేయాల్సిన పనిని ఇప్పటికైనా చేశారని అన్నారు. ఇకనైనా నిందితుడిని అరెస్టు చేసి మధ్యవర్తిత్వం వ హించిన వారిని, కొడుకును కాపాడిన తండ్రి ని కూడా విచారించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ అంటే.. బలాత్కార జనతా పార్టీ : వాసుదేవరెడ్డి
ఇకపై బీజేపీ అంటే ‘బలాత్కార జనతా పా ర్టీ’గా ప్రజలు పిలుస్తారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బాలికపై చేసిన అఘాయిత్యాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకోకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు.

యూపీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన అంశంలో రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సుదీర్ఘకాలంగా ఆందోళనలు చేశారని ఆయన గుర్తుచేశారు. ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన ఘటనలు జరిగినప్పుడు శిగమూగే బండి సంజయ్ ఇప్పుడు రాజకీయ కుట్ర అని త ప్పించుకోవడం తగదని హితవు పలికారు..
అరెస్టు ఇంకెప్పుడు? : గాంధీనాయక్
పోక్సో కేసు నమోదై రోజులు గడుస్తున్నా భగీరథను పోలీసులు ఎందుకు అరెస్టు చేయ డం లేదని టీఎస్జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ ధరావత్ ప్రశ్నించారు. భగీరథ్‌పై వెంటనే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని, ఎకడ కనిపించినా అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భగీరథ్ ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం రివార్డు ప్రకటించాలని సూచించారు. కేసు విచారణ పారదర్శకంగా జరిగేందుకు సంజయ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
గుడిలో ప్రమాణానికి సిద్ధమా? : ఉపేంద్ర
బండి సంజయ్ తన కొడుకుతో ఏ తప్పూ చేయలేదని చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడిలో తడిబట్టలతో ప్రమాణం చేయటానికి సిద్ధమేనా? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర స వాల్ విసిరారు. భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి పోలీసులు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక్క మాట మాట్లాడకుండా అభినవ ధ్రుతరాష్ర్టుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బేటీ బచావో అని నినాదాలిస్తున్న లక్ష్మణ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, అరవింద్, మాట్లాడకపోవడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

