గురుకుల కుంభకోణ సూత్రధారి రేవంత్
రాష్ట్రంలోని గురుకులాల్లో భారీ అవినీతికి సీఎం రేవంత్‌రెడ్డే ప్రధాన సూత్రధారి అని, అలాంటిది ఆయనకే ఫిర్యాదు చేయాలనడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్' వేదికగా మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టే ప్రతి పథకం వెనుక ఒక భారీ కుంభకోణం దాగి ఉంటుందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
- ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణ
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకులాల్లో భారీ అవినీతికి సీఎం రేవంత్‌రెడ్డే ప్రధాన సూత్రధారి అని, అలాంటిది ఆయనకే ఫిర్యాదు చేయాలనడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టే ప్రతి పథకం వెనుక ఒక భారీ కుంభకోణం దాగి ఉంటుందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిజాన్ని తొకిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, గురుకులాల్లో అక్రమాలపై గతంలోనే బీఆర్ఎస్ అన్ని ఆధారాలను బయటపెట్టి బహిరంగ చర్చకు సవాలు విసిరినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన గుర్తుచేశారు. పసిపిల్లల భవిష్యత్తును తాకట్టు పెడుతూ కేరళ ఎన్నికల ఖర్చుల కోసమే పీఎంయూ జీవో 17 తీసుకొచ్చారని ఆరోపించారు. సచివాలయంలో చక్రం తిప్పుతున్న దుష్టచతుష్టయం వెనుక ఉన్న అసలు శక్తులను త్వరలోనే పూర్తి ఆధారాలతో బయటపెడుతామని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

