Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Abdul El-Sayed: మిచిగన్ సేనేట్ రేసులో డెమోక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సయ్యద్ ముందంజలో ఉన్నారు. దీంతో అమెరికా రాజకీయాల్లో కొత్త చరిత్ర ఆవిష్కృతంకానున్నది. అమెరికా సేనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తిగా అబ్దుల్ రికార్డు క్రియేట్ చేయనున్నారు.
మిచిగన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో కొత్త చరిత్ర లిఖితమైంది. మిచిగన్ రాష్ట్రం నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సయ్యద్(Abdul El-Sayed).. సేనేట్ రేసులో విజయం సాధించినట్లు అంచనా వేస్తున్నారు. రిపబ్లికన్ నేత మైక్ రోజర్స్‌పై ఆయన గెలుపొందినట్లు ప్రాథమిక ఫలితాల ద్వారా తెలుస్తోంది. దీంతో అమెరికా రాజకీయ చరిత్రలో సేనేటర్గా గెలిచిన తొలి ముస్లిం నేతగా అబ్దుల్ ఎల్ సయ్యద్ రికార్డు సృష్టించారు. తాజా మధ్యంతర ఎన్నికల్లో అనేక మైలురాళ్లు చోటుచేసుకుంటున్నాయి. డోనాల్డ్ ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ ఓటర్లు తీర్పును ఇస్తున్నారు. ముస్లిం సేనేటర్ మాత్రమే కాదు.. తొలి నల్లజాతి మహిళా గవర్నర్, తొలి గే మేల్ సేనేటర్, తొలి మహిళా నేటివ్ అమెరికన్ గవర్నర్‌గా డెమోక్రటిక్ అభ్యర్థులు విజయాలు సాధించినట్లు తెలుస్తోంది.

లెఫ్టిస్ట్ అబ్దుల్ ఎల్ సయ్యద్ చాలా తీవ్రమైన పోటీలో పాల్గొన్నారు. మెడికల్ అడ్మినిస్ట్రేటర్ అయిన అబ్దుల్.. మిచిగన్‌లో ఎన్నికల వేళ భారీ ప్రదర్శన చేపట్టారు. హెల్త్‌కేర్‌ను ఫ్రీగా అందిస్తానని చెప్పి ఆయన ఎన్నికల్లో ప్రచారం చేశారు. దీంతో ఎక్కువ స్థాయిలో ఓటర్లను అబ్దుల్ ఆకర్షించారు. మిచిగన్‌లో 78 శాతం ఓట్లను లెక్కించారు. దాంట్లో ఇప్పటి వరకు అబ్దుల్ ఆధిక్యంలో ఉన్నారు.
మిచిగన్‌లో మద్దతుదారులను ఉద్దేశిస్తూ అబ్దుల్ సయ్యద్ మాట్లాడారు. రేసు పోటీపోటీగా ఉన్నా.. తానే గెలిచినట్లు అబ్దుల్ ప్రకటించుకున్నారు. మిచిగన్.. మీకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఎన్నికల ప్రచారం వేళ.. తన మతవిశ్వాసాలను టార్గెట్ చేస్తూ విపక్షాలు ప్రచారం చేశాయని ఆరోపించారు.
ఇండియాతో లింకు..
అబ్దుల్ ఎల్ సయ్యద్‌కు ఇండియాతో కనెక్షన్ ఉన్నది. ఆయన భార్య డాక్టర్ సారా జుకాకుది కోస్టల్ కర్నాటక. ఆమె సైక్రియాట్రిస్ట్. మంగుళూరుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న భత్కల్‌లో సారా ఫ్యామిలీ ఆనవాళ్లు ఉన్నాయి. గతంలో సీఎం బీడీ జెట్టి దగ్గర ఫైనాన్స్ శాఖ డిప్యూటీ మంత్రిగా పనిచేసిన జుకాకు షాంషుద్దిన్ మనువరాలే సారా. అయితే యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో చదువుతున్న సమయంలో ఎల్ సయ్యద్, సారా మధ్య పరిచయం ఏర్పడింది. దక్షిణ భారత కుటుంబం, సంస్కృతి గురించి తాను తెలుసుకున్నట్లు పలు సందర్భాల్లో ఎల్ సయ్యద్ తెలిపారు. నేను అరబ్ కన్నా ఎక్కువగా ఇండియన్‌గా మారిపోయినట్లు ఎన్నికల ప్రచార సమయంలో సయ్యద్ తెలిపారు. భత్కల్‌లో సారా ఫ్యామిలీ కనెక్షన్ ఉన్నా.. ఆమె కుటుంబీకులు అందరూ ప్రస్తుతం బెంగుళూరులో సెటిల్ అయినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

