కార్మికుల సంక్షేమ బోర్డులో అవినీతి
రాష్ట్రంలో సుమారు 20నుంచి 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండాల్సిన సంక్షేమబోర్డు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అవినీతి అక్రమాలకు గురువుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
- నిధుల దోపిడీపై మరో పోరాటానికి సిద్ధం కావాలి
- ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్
చిక్కడపల్లి, నవంబర్17(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సుమారు 20నుంచి 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండాల్సిన సంక్షేమబోర్డు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అవినీతి అక్రమాలకు గురువుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కార్మికుల సంక్షేమ నిధుల దోపిడీపై మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చా రు. బీఆర్ఎస్ కార్మిక సంఘం బీఆర్టీయూ అనుబంధ తెలంగాణ రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు పరిరక్షణకు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ట్ర కనీస వేతన సలహా మండలి మాజీ చైర్మన్, సంఘం అధ్యక్షుడు పీ నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు నిధులు దోపిడీకి గురవుతున్నాయని మండిపడ్డారు. సంక్షేమ బోర్డు నిధులపై కాంగ్రెస్ సర్కార్ కన్ను పడిందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

