పింఛన్ పెంచకపోవడం విచారకరం
అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడవద్దని, కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారుల కోసం పనిచేయకూడదని, పేద ప్రజల సంక్షేమంకోసం పాటుపడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.
- ఎన్నికల్లో ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలే
- గ్రామాలకు వెళితే ప్రజలు నిలదీస్తున్నరు
- కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం పనిచేయవద్దు
- అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడవద్దు!
- కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డ్డి
చౌటుప్పల్ రూరల్, నవంబర్17 : అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడవద్దని, కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారుల కోసం పనిచేయకూడదని, పేద ప్రజల సంక్షేమంకోసం పాటుపడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలో చౌటుప్పల్, నారాయణపురం మండలాల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టం ఏర్పాటైతే తమ బతుకులు బాగుపడతాయని వేలాది మంది ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందించాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. పెన్షన్ నాలుగువేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చకపోవడం విచారకరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాలకు వెళితే.. పెన్షన్ ఎప్పుడు పెంచుతారు అని నిలదీస్తున్నారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

