హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సొంత నియోజవర్గం ఆందోల్‌కు నర్సింగ్ కాలేజీ మంజూరైంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంఈ నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. కాలేజీ ఏర్పాటుకు రూ.43 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపింది.