హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మాజీ సైనికుల పిల్లలకు కంప్యూటర్ గ్రాంట్ కింద రూ. 40 వేలు ఇవ్వనున్నట్టు సైనిక సంక్షేమశాఖ ప్రకటించింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన మాజీ సైనికుల పిల్లలు అర్హులని, సాయధ దళాల పతాక నిధి నుంచి ఈ గ్రాంట్ మంజూరుచేస్తామని హైదరాబాద్ ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి శ్రీనేష్కుమార్ తెలిపారు.
అర్హులైనవారు www. sainik. telangan a.gov.in వెబ్సైట్ను సంప్రదించి డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రధాన మంత్రి స్కాలర్షిప్ కింద అమ్మాయిలకు రూ. 36వేలు, అబ్బాయిలకు రూ. 30వేలు అందజేయనున్నట్టు తెలిపారు. ఇందుకు www. ksb.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.