ఆర్టీసీకి సర్కారు అండ

- చరిత్రలో తొలిసారి బడ్జెట్లో మూడువేల కోట్లు
- కరోనా సమయంలో జీతాలకోసం నెలనెలా నిధులు
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నష్టాల్లో ఉన్నవాటితోపాటు లాభాల్లో ఉన్న సంస్థలను కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు తెగనమ్ముతుంటే, రాష్ట్రంలో పేదల బతుకు చక్రం ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్రప్రభుత్వం నిత్యం తపిస్తున్నది. ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినా నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి ఆపన్నహస్తం అందిస్తూనే ఉన్నది. వేల కార్మిక కుటుంబాలు, కోట్లమంది సామాన్య ప్రయాణికుల జీవితాలతో ముడిపడిన అంశం కావడంతో సీఎం కేసీఆర్ ఆర్టీసీ విషయంలో మానవతా దృక్పథంతోనే ముందుకెళ్తున్నారు. టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఇదీ.
- ఆర్టీసీ 87 ఏండ్ల చరిత్రలో తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం నేరుగా బడ్జెట్లో రూ.3వేల కోట్లు కేటాయించింది.
- తక్షణ అవసరాల కోసం ఇప్పటికే రూ.వెయ్యికోట్ల బ్యాంకు రుణానికి గ్యారెంటీ ఇచ్చింది.
- కరోనాతో పూర్తిగా ఆదాయం కోల్పోయి కనీసం వేతనాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు 2020 మార్చి నుంచి ప్రతినెలా ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం రూ.125 కోట్లు ప్రభుత్వమే సర్దుబాటు చేస్తున్నది.
- టీఎస్ఆర్టీసీలోని కో-ఆపరేటివ్ సొసైటీ లోన్ల కోసం ఎన్సీడీసీ (నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా రూ.400 కోట్లు రుణం ఇప్పించేందుకు ప్రాసెస్ పూర్తి చేసింది.
- ఆర్టీసీ హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు మరింత చేరవయ్యేలా రూ.500 కోట్లు వెచ్చించి 120 ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

