ఫ్యాషన్ ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారినా, కొన్ని మాత్రం ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తాయి. అలాంటి వాటిని తరువాతి తరాలు సైతం ఫాలో కావడానికి ఇష్టపడుతుంటారు. వాటిలో కొన్నింటికి జెన్ జీ జైకొడున్నది. కేవలం అందంగా ఉండే దుస్తులు, యాక్ససరీస్ మాత్రమే కాకుండా కంఫర్ట్‌గా ఉండే వాటినే ఈ తరం ఎకువగా ఇష్టపతున్నారు.
దుపట్టా: ఈ వస్ర్తాన్ని సంప్రదాయక దుస్తులపైనే వాడతామనే భావన ఉంటే మీరు పప్పులో కాలేసినట్లే. దుపట్టాను జెన్ జీ రకరకాలుగా వాడుతున్నారు. సార్ఫ్గా, కేప్‌గా, కాంటెంపరరీ డ్రెస్‌లపై, మోడ్రన్ గౌన్ల మీదికి దీన్ని వాడేస్తున్నారు.
పలాజో: ఎకువగా కంఫర్ట్‌గా ఉండే దుస్తులపైనే ఈ తరం యువత ఆసక్తి చూయిస్తున్నారు. అందుకే ఎలాంటి టాప్ మీద అయినా పలాజోతో స్టైల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కంఫర్ట్ స్టైల్‌ను ఇష్టపడే యువత.. పలాజోకే మొగ్గుచూపుతున్నారు.
గాజులు: ఒకప్పుడు గాజులంటే చీరలపైన, సంప్రదాయ దుస్తులపైనా సూట్ అవుతాయని అనుకుని.. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు ఎకువగా ప్రిఫర్ చేసేవాళ్లు. అయితే రంగురంగుల చూడీలు, స్టేట్మెంట్ బ్రాస్లెట్ల గాజులను ఇప్పుడు ఎత్నిక్, వెస్ట్రన్ దుస్తులు రెండిటితోనూ ఎకువగా స్టైల్ చేస్తున్నారు. ఇవి రోజువారీ లుక్స్‌కు వ్యక్తిత్వాన్ని, ఆకర్షణను యాడ్ చేస్తుండటం విశేషం.
బోల్డ్, హెవీ జువెలరీ: ఈ తరమంతా బోల్డ్, హెవీ, ఆకర్షణీయమైన జువెలరీని ఇష్టపడుతుండటంతో నార్మల్ ఆభరణాలు వెనుకబడిపోతున్నాయి. భారీ చెవిపోగులు, లేయర్డ్ నెక్లెస్‌లు, స్టేట్మెంట్ రింగులు, భారీ కఫ్‌లు వార్డ్‌రోబ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ జువెలరీ మనం వేసుకునే దుస్తుల అందాన్ని కూడా పెంచుతాయి.
మెష్ టాప్స్: ఒకప్పుడు ఎంతో ట్రెండింగ్‌లో ఉన్న వీటిని జెన్ జీ మళ్లీ తీసుకొస్తుంది. బ్రాలెట్స్, క్యామిసోల్స్, డ్రెస్సుల మీద లేయర్‌గా వేసుకున్నప్పుడు మెష్ టాప్స్ ఒక స్పెషల్ లుక్‌ను తీసుకొస్తాయి. అవి ఫార్మల్‌గానూ, స్పెషల్ డేస్‌లోనూ చాలా అందంగా ఉంటాయి.