హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ) : స్విట్జర్లాండ్లోని దావోస్లో వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ వాణిజ్య వేదిక(డబ్ల్యూఈఎఫ్)-2025 వార్షిక సదస్సు కోసం ప్రభుత్వం రూ. 12.30కోట్లు విడుదల చేసింది. ఈ సదస్సులో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు అవసరమైన ఖర్చులకు నిధులు మంజూరు చేస్తూ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఐటీ, పరిశ్రమల శాఖకు చెందిన 2024-25 బడ్జెట్ నుంచి నిధులను తెలంగాణ సర్వీసెస్ టెక్నాలజీ(టీజీటీఎస్)కు విడుదల చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): పరిస్థితులు, ప్రాధాన్యతలకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లు పనితీరు మార్చుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్పొరేషన్ల ఎండీలను ఆదేశించారు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని వ్యా పార దృక్పథంతో పనిచేయాలని, ఆర్థిక పరిపుష్టిని సాధించాలని తెలిపా రు. సచివాలయంలో అన్ని కార్పొరేషన్లపై సోమవారం సమీక్ష నిర్వహించారు.