హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు చేసి ఓపీఎంఎస్లో నమోదైన ప్రతి రైతుకు డబ్బులు బదిలీ చేశామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలి పారు. సోమవారం ఒక్కరోజే 1500 కోట్లను ఏకమొత్తంగా విడుదల చేసినట్టు చెప్పారు. దీంతో కలుపుకుని ఇప్పటివరకు 11,444 కోట్లను రైతుల ఖాతాలకు బదిలీ చేసినట్టు వివరించారు. సోమవారం వరకు 11.10 లక్షల మంది రైతుల నుంచి 65.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియ దాదాపు ముగిసిందని, 100 సెంటర్లలో మాత్ర మే అకడకడ కొనుగోళ్లు జరుగుతున్నట్టు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదనడానికి ధాన్యం సేకరణ నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సీఎం ఆదేశంతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టామని వివరించారు.