హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీకి రూ.108.4 కోట్లు విడుదలచేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గురుకుల పాఠశాలలకు రూ.47.50 కోట్లు, గురుకుల జూనియర్ కళాశాలల నిర్వహణకు రూ.60.91 కోట్లు మంజూరు చేసింది.