హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కోసం ప్రభుత్వం అదనంగా రూ.100కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయాదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
బీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బడ్జెట్లో 900కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. అందుకు అదనంగా మరో రూ.100 కోట్లను మంజూరు చేసింది. బడ్జెట్ను వెయ్యికోట్లుగా సవరించింది. అయితే ఇప్పటికీ ఒక్క రూపాయి సర్కార్ విడుదల చేయలేదు.