హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన పరిహారం రూ.10.3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 1080 మంది బాధితులకు ఈ మొత్తాన్ని అధికారులు అందించనున్నారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ బాధితులకు పరిహారం అందని విషయంపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ప్రచురించింది. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. తాజాగా బాధితులకు ఆర్థిక సాయానికి ఉత్తర్వులు ఇచ్చింది.