RRR | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఓ వైపు నిధుల వరద.. మరోవైపు నిధుల కొరత. ఇదీ రహదారుల అభివృద్ధి విష యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసం
. తాజాగా కేంద్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ద్వారా బాండ్లు జారీచేసి, భారీగా నిధులను సమీకరిస్తుంటే.. మన రాష్ట్రంలో ప్రాంతీయ రింగు రోడ్డు (ట్రి పుల్స్టార్) లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అవ సరమైన భూములను సేకరించేందుకు నిధు లు లేని దుస్థితి నెలకొన్నది.
కేంద్రం అమలు చేస్తున్న ‘ఇన్విట్’ విధానం ద్వారా తెలంగాణకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందనేఅంశం ప్రస్తుతం ఇన్ఫ్రా రంగం నిపుణలో న్నది. కాగా, తెలంగాణ ప్రభుత్వ ఆసత్య ఆర్ రోడ్ల అభివృద్ధికి నాలుగు విధానాలు చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకమైనదిగా ట్రిపుల్ఆర్ ప్రాజెక్టు ఖర్చును పూర్తిగా కేంద్రమే భరిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతు న్నారు. దేశంలో రహదారుల అభివృద్ధికి అవ సరమయ్యే నిధుల సమీకరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఎఐ) ‘ఇన్విట్ ‘ విధానాన్ని అమలు చేస్తు న్నది. దీనిలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్ తరహాలో బాండ్లను జారీచేసి ప్రైవేటు ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరిస్తున్నది. సెక్యూరి టీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ద్వారా నియంత్రించే ఈ విధానంలో బాండ్లు కొనుగోలు చేసినవారికి 8.05% వడ్డీ లభిస్తుందని కేంద్రం చెప్తున్నది.
ఈ ఏడాది మే నెలలో ప్రారంభించిన ఈ విధానం ద్వారా రానున్న రోజుల్లో దాదాపు రూ.10 లక్షల కోట్లు సమీకరించి దేశవ్యాప్తంగా 30 వేల కి.మీ. రహదారులను 2 లేన్ల నుంచి 4 లేన్లకు విస్తరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిలో భాగంగా కేంద్రం ఇప్పటికే మూడు దఫాల్లో బాండ్లు జారీచేసి రూ.20 వేల కోట్ల కుపైగా నిధులు సమకూర్చుకున్నట్టు తెలుస్తున్నది. కాగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును దాదాపు రూ.35 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును ఎన్హెచ్ఐఐ ఆధ్వర్యంలో నిర్మి స్తున్నప్పటికీ భూసేకరణకు అయ్యే రూ.5 వేల కోట్ల ఖర్చులో సగభాగాన్ని (రూ.2,500 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉన్నది. కానీ, నిధుల కొరత, ఇతర ఇబ్బందుల వల్ల ఈ వ్యవహారం ముందుకు సాగడం లేదు.
ట్రిపుల్ఆర్ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలి
అంతర్రాష్ట్ర రహదారుల అభివృద్ధికయ్యే వ్యయాన్ని ఎన్హెచ్ఎఐ ఆధ్వర్యంలో పూర్తిగా కేంద్రమే భరిస్తున్నప్పటికీ ట్రిపుల్ఆర్ లాంటి రాష్ట్ర ప్రాజెక్టులకు మాత్రం ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉండాలని కేంద్రం కోరుతు న్నది. ఒకవేళ పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తే ట్రిపుల్ఆర్ ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుందని మౌలిక సదుపాయాల రంగం నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్రా నికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సహా వివిధ ఆర్థిక సంస్థల నుంచి అతితక్కువ వడ్డీకి విరి విగా నిధులు సమకూరడంతోపాటు ‘ఇన్విట్’ లాంటి విధానాలతో సామాన్యుల నుంచి కూడా భారీగా నిధులు సమకూరుతున్నాయని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ట్రిపులర్కు అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించి టోల్ చార్జీల ద్వారా రాబట్టుకునే అవకాశం ఉన్నందున దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు.
రోడ్ల అభివృద్ధికి నాలుగు విధానాలు
రహదారుల అభివృద్ధిలో కేంద్రం ప్రధానంగా బీవోటీ (బిల్డ్-ఆపరేట్-ట్రాన్సఫర్), ఈపీసీ (ఇంజినీరింగ్-ప్రొక్యూర్మెంట్-కన్స్ట్రక్షన్), ఇన్విట్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానాలను అమలు చేస్తున్నది. బీవోటీ విధానంలో కాంట్రాక్టరే రోడ్డును నిర్మించి, ఒప్పంద గడువు ప్రకారం కనీసం 15 ఏండ్లపాటు దాన్ని నిర్వహించడంతో పాటు టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటారు. కానీ, ఇటీవల కేంద్రం ఈ విధానంలో స్వల్ప మార్పులు చేసింది. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే టోల్ చార్జీలు వసూలు చేసి, ఒప్పందం మేరకు కాంట్రాక్టరుకు వార్షిక చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
ఈ 15 ఏండ్లు కాంట్రాక్టరే రోడ్డు నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. ఈపీసీ విధానంలో డిజైన్ల రూపకల్పన నుంచి ప్రాజెక్టు పూర్తయ్యేవరకు కాంట్రాక్టరే బాధ్యత తీసుకుంటాడు. కానీ, దీనిలోపాలు న్నట్టు గుర్తించడం, నిధుల సమస్యతో ప్రాజెక్టులు నిలిచిపోవడంతో ఈ విధానంపై ఆసక్తి తగ్గుతున్నది. హ్యామ్ మాడల్లో కాంట్రాక్టర్ 60%, ప్రభుత్వం 40% నిధులు వెచ్చిం చాలి. కాంట్రాక్టరు వెచ్చించిన నిధులను 15 ఏండ్లపాటు టోల్ చార్జీల ద్వారా రాబట్టుకుం టారు. ప్రస్తుతం ఈ విధానం ప్రాచుర్యంలో ఉన్నది. తాజాగా ‘ఇన్విట్’ విధానం ద్వారా కేంద్రం భారీగా నిధులను సేకరిస్తున్నది. ఈ విధానంలో పెట్టుబడిదారుల నుంచి సమీక రించే నిధులను రహదారులపై వచ్చే ఆదాయం ద్వారా తిరిగి చెల్లిస్తారు.