(ఎడ్యుకేషన్ డెస్క్, హైదరాబాద్) : దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ (సీఈఎన్)-03/2024ను రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేసింది. మొత్తం 7951 ఖాళీలు ఉన్నాయి. సికింద్రాబాద్ రీజియన్లో 590 ఖాళీలు ఉన్నాయి.
వీటిలో జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్/రీసెర్చ్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా బీఈ/బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులైనవారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి చివరితేదీ ఆగస్టు 29. వివరాలకు https://rrb secunderabad.gov.in చూడవచ్చు.