Telangana | ఈ మధ్య రైల్వే స్టేషన్లల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్ నుంచి దిగడం, ఎక్కడం లాంటివి చేసే సమయంలో అనుకోకుండా ప్రమాదాలకు గురి అవుతున్నారు ప్రయాణికులు. తాజాగా వరంగల్ రైల్వే స్టేషన్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకోగా.. కదులుతున్న రైలు నుంచి దిగబోయి జారిపడిన ప్రయాణికురాలిని ఓ మహిళా కానిస్టేబుల్ కాపాడింది.
వివరాల్లోకెళితే.. మణుగూరు (Manuguru) నుండి సికింద్రాబాద్ (Secunderabad) వెళ్తున్న మణుగూరు ఎక్స్ప్రెస్ రైలు వరంగల్ (Warangal) రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఆ సమయంలో ఓ ప్రయాణికురాలు కిందికి దిగబోయి ప్లాట్ ఫాంకు, రైలుకు మధ్యలో పడింది. దాంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ (RPF Constable) సోనాలి మాల్కే (Sonali malkhe) వెంటనే స్పందించింది. మహిళను పైకి లాగి ప్రాణాలు కాపాడింది. దాంతో అక్కడే ఉన్న ప్రయాణికులు.. సోనాలిని మెచ్చుకున్నారు. విషయం తెలిసుకున్న ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు సోనాలి మాల్కేను అభినందించారు.