హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘తెలంగాణ అస్తిత్వం-సవాళ్లు-కర్తవ్యాలు’ అనే అంశంపై ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
ప్రముఖ పాత్రికేయుడు పీ వేణుగోపాలస్వామి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్, జూలూరు గౌరీశంకర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ తదితరులు పాల్గొననున్నట్టు వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ తెలిపారు.