హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): పోషక విలువలు అందించడం కోసం అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలతోపాటు చిన్నారులకు అందించే గుడ్ల సరఫరాలో కాంట్రాక్టర్లు కక్కుర్తి పడుతున్నారు. కుళ్లిన, గడువు ముగిసి పాడైపోయిన గుడ్లను సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా లబ్ధిదారుల్లో పోషక విలువలు లోపించి నీరసించిపోతున్నారు. నిధులు దు ర్వినియోగం అవుతున్నాయి. అసలు దోషుల ను గుర్తించి చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాల సంఘం రాష్ట్ర నాయకురాలు నల్ల భారతి డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 1 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): డిజిటల్ క్రాప్ సర్వే చేయడం తమవల్లకాదని రాష్ట్రవ్యాప్తంగా ఏఈవోలు నెత్తి నోరు మొత్తుకుంటున్నా.. ప్రభుత్వం వారి మాటలను పెడచెవి పెట్టి ఉక్కుపాదం మోపుతున్నది. వారి విజ్ఞప్తులను పక్కనపెట్టి క్రమశిక్షణ చర్యలను చేపడుతున్నది. రాష్ట్రంలో ఉన్న 2,604 మంది ఏఈవోలు ఇప్పటికే 49 రకాల విధులు నిర్వహిస్తూ డిజిటల్ క్రాప్ సర్వే తమకు తలకుమించిన భారమని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వం సర్వేలు చేయకుండా విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారితో 59 మంది ఏ ఈవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో 40 మంది ఏఈవోలు యా ప్ డౌన్లోడ్ చేసుకోలేదని గత నెల 27, 28 తేదీల్లో గైర్హాజరు వేసి ప్రభుత్వానికి పంపించారు. మరికొన్ని జిల్లాల్లోనూ చర్యలకు ఉపక్రమించినట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యం లో ఏఈవోల ఆందోళనకు తమ మద్దతు ఉం టుందని టీఎన్జీవో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ చెప్పినట్టు తెలుస్తున్నది.