అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో (Rayalaseema Express) చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి చొరబడిన దొంగలు ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు. ఈ సమయంలోనే దుండగులు ఆ రైలులోని 10 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. దీంతో 20 మంది బాధిత ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులను ఆశ్రయించారు.
కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు పడుతున్నది. సోమవారం 65,904 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,487 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.53 కోట్ల ఆదాయం సమకూరింది.