Road Accident | సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. చివ్వెం మండలం బీబీగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు వారి ఎనిమిదేళ్ల కూతురు ప్రాణాలు కోల్పోయింది. మృతులను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన గడ్డం రవీందర్, రేణుక, రితికగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.