హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ శనివారం తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి తిరుమలకు భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్, కుటుంబ సభ్యులతో చేరుకొని శనివారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
ఆలయ మర్యాదల ప్రకారం టీటీడీ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.