ముంబై, ఆగస్టు 11: మహారాష్ట్రలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. చాందివాలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వల్ రమేశ్ మాలజీ నాయకత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అధిక ఫీజులు వసూ లు చేస్తూ కనీస సదుపాయాలు కల్పించని ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు మొమోరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముంబై ప్రాంత అధ్యక్షుడు హేమంత్ కుమార్ బద్ది, పదాధికారులు సంజయ్ నింబాలర్, జయప్రకాశ్ పవార్, రాజేశ్ జాదవ్, సందీప్, నర్పక లక్ష్మణ మహారాజ్, ఎం అంజిబాబు, సీ నాగరాజ్, బీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.