హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : మహిళా శిశు సంక్షేమం పై బుధవారం సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క హాజరై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షే మ శాఖలకు కేటాయించాల్సిన బడ్జెట్ అంచనాలపై చర్చించారు. వారు మా ట్లాడుతూ.. అంగన్వాడీ పిల్లలపై పెట్టే పెట్టుబడి వారి అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పోషకాహారం అందించడంతో వారికి ఉజ్వల భవిష్యత్తును ప్రసాదిం చే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లా కేంద్రాల్లోని మహిళా ప్రాంగణా ల స్థితిగతులపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక ఆరా తీశారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేశ్‌కుమార్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అని తా రామచంద్రన్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాసర్ తదితరులు పాల్గొన్నారు.
వెదురు వస్తువులు ఉపయోగించాలి మంత్రి సీతక్క
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : ప్రజలంతా ప్లాస్టిక్ బదులుగా వెదురు వస్తువులను ఉపయోగించాలని మహిళా శిశు సంక్షే మ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభు త్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిపా రు. బుధవారం ఎంసీఆర్‌హెచ్చార్డీ లో ఏర్పాటుచేసిన వ్యవసాయ వెదురు వర్క్‌షాప్‌నకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా వెదురు సాగును ప్రోత్సహించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యాచరణతో వర్క్‌షాప్ నిర్వహించడం అభినందనీయమన్నారు.