హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంపై లైవ్‌స్టాక్, డెయిరీ, ఫిషరీస్ (ఎల్డీఎఫ్) ఇండియా ఎక్స్పోజిషన్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్ ఆఫీస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సదస్సుకు దళిత్ ఇండియన్చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డీఐసీసీఐ) జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్, స్టేట్ ప్రెసిడెంట్ అరుణ దాసరి ముఖ్యఅతిథులుగా హాజరవుతారని పేర్కొన్నది.