ఏసీబీకి చిక్కిన రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్
లంచం తీసుకొంటూ రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ వెల్లడించిన వివరాల మేరకు.. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు శ్రీరాములు
ఉండవెల్లి, జూలై 5: లంచం తీసుకొంటూ రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ వెల్లడించిన వివరాల మేరకు.. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు శ్రీరాములు, ఎల్లస్వామి.. జూలై 2020లో చిన్న ఆముదాలపాడు గ్రామ శివారులోని సర్వే నంబర్ 63/ఏ2లో కొంత భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. ఆ తరువాత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకురావడంతో భూమి పట్టా మార్పిడి జరగలేదు.
కొంతకాలం నిరీక్షించిన అనంతరం పెండింగ్ మ్యుటేషన్లకు ధరణి సైట్లో ఆప్షన్ రావడంతో కలెక్టర్ లాగిన్‌కు 2021 అక్టోబర్ 14న సదరు అన్నదమ్ములు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా అన్న ఎల్లస్వామి కొనుగోలు చేసిన 2.22 ఎకరాల భూమికి సంబంధించి 2022 జూన్ 10న పాస్‌బుక్ వచ్చింది. శ్రీరాములు కొనుగోలు చేసిన 2.34 ఎకరాల భూమి భూదాన్‌లో ఉన్నట్టు ఆన్లైన్లో చూపించింది. ఈ సమస్యను పరిష్కరించాలని శ్రీరాములు గత నెల 19న తాసిల్దార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాను కలిశాడు. ఇందుకు ఆయన రూ.10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ.7,500కు ఒప్పందం కుదుర్చుకొన్నాడు. అనంతరం గతనెల 25న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సలహా మేరకు మంగళవారం ఉండవెల్లి తాసిల్దార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాకు రూ.7,500 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. అయితే సాయిబాబా నివాసం ఉంటున్న కర్నూలు జిల్లాలోని సంతోష్ నగర్లోనూ హైదరాబాద్ ఏసీబీ ఇన్సెక్టర్ రమేశ్, మెదక్ ఇన్సెక్టర్ కే రమేశ్ సోదాలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

