హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన భూభారతి చట్టం రాష్ట్రంలో భూ పరిపాలనకు కొత్త దిక్సూచిలా మారిందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చి నేటితో ఏడాది పూర్తయినట్టు చెప్పారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు.