ఈడబ్ల్యూఎస్కు ఆదాయమే ప్రాతిపదిక
- స్థిర ఆస్తులతో సంబంధం లేదు
- మీ సేవకు రెవెన్యూశాఖ మార్గదర్శకాలు
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ధ్రువపత్రాల జారీలో ఆదాయాన్ని మాత్రమే ప్రతిపాదికగా తీసుకోవాలని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. స్థిరాస్తులతో సంబంధం లేదని చెప్పింది. ధ్రువపత్రాల జారీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన మార్గదర్శకాల మధ్య భూమి విస్తీర్ణం, ఇల్లు వంటి అంశాల్లో వ్యత్యాసం ఉండటంతో గందరగోళం తలెత్తింది. దీంతో పలువురు రెవెన్యూ శాఖను కోరగా, గురువారం స్పష్టత ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రం కేంద్రం నోటిఫికేషన్ ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆదాయాన్ని మాత్రమే ప్రతిపాదికగా తీసుకోవాలని చెప్పింది. ఈ మేరకు మీ సేవ పోర్టల్లో రెండు రకాల దరఖాస్తులను పొందుపరచాలని, వాటిల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులు చేయాలని మీ సేవ ఎండీని కోరింది.
తాజా మార్గదర్శకాల ప్రకారం..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అన్ని రకాల ఆదాయ మార్గాలు కలిపి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉంటే చాలు. స్థిరాస్తులతో సంబంధం లేదు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు..
ఆదాయం: 8 లక్షలలోపు (అన్ని రకాల ఆదాయ మార్గాలు కలిపి)
స్థలం/ఇల్లు: మున్సిపాలిటీల్లో అయితే 100 గజాల్లోపు స్థలం, కార్పొరేషన్లలో అయితే వెయ్యి చదరపు అడుగుల్లోపు ఇల్లు, గ్రామాల్లో ఐదెకరాల్లోపు భూమి, మున్సిపాలిటీయేతర ప్రాంతాల్లో 200 చదరపు గజాల్లోపు ఇల్లు లేదా స్థలం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

