శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 16:26:58

కోర్టులు అనుసరించాల్సిన ఆన్‌లాక్‌ విధానం వెల్లడి

కోర్టులు అనుసరించాల్సిన ఆన్‌లాక్‌ విధానం వెల్లడి

హైదరాబాద్‌.. డిసెంబర్‌ 31వ తేదీ వరకు రాష్ట్రంలోని కోర్టులు అనుసరించాల్సిన ఆన్‌లాక్‌ విధానాన్ని హైకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో కేసుల విచారణ భౌతికంగా కొనసాగుతుంది. ఇకపై రాష్ట్రంలో అన్ని కోర్టులు తెరవాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ జిల్లాలోని సివిల్‌, క్రిమినల్‌ కోర్టులూ తెరవాలని ఆదేశించింది. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు వేగంగా విచారణ జరపాలని ప్రత్యేక కోర్టుకు స్పష్టం చేసింది. సీబీఐ, ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులు ప్రస్తుత విధానమే కొనసాగించాలంది. హైకోర్టు విధించిన గడువుకు కట్టుబడి విచారణ జరపాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.