హిమాయత్‌నగర్, మే 29: వెలమ సామాజిక వర్గంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని అంతర్జాతీయ వెలమ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు పీ వెంకటేశ్వరరావు డిమాండ్‌చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ఇటీవల వెలమ జాతిని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
కులాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్ పతనానికి దారి తీయడమేనని తెలిపారు. సీఎం కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ర్టాన్ని సాధించారని, కేసీఆర్ పెట్టిన భిక్షతోనే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి అయిన విషయం మర్చిపోవద్దని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో రెడ్డి, వెలమలు కలిసి పనిచేశారే తప్ప ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయలేదన్నారు. సమావేశంలో జాగృతి నాయకులు నారాయణరావు, శ్రీనివాసరావు, చంద్రశేఖరరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.