(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): పెట్టుబడులే లక్ష్యంగా సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్‌రెడ్డి పది రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 3న ప్రారంభమైన ఈ పర్యటనలో రూ. 31,500 కోట్ల పెట్టుబడులను సాధించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) చేసుకున్నట్టు వివరించింది. దీంతో రాష్ట్రంలో కొత్తగా 30,750 ఉద్యోగాలు లభించనున్నట్టు తెలిపింది. అయి తే, రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా ఎంవోయూ చేసుకొన్న కంపెనీల్లో కొన్ని బోగస్ కంపెనీలు ఉన్నట్టు తెలుస్తున్నది.
అంతేకాదు.. రేవంత్ బృందం ఒప్పందం చేసుకొన్న మరికొన్ని దిగ్గజ కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో సేవ లు ప్రారంభించాయని, బీఆర్ఎస్ హయాంలోనే ఆయా కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని, ఇప్పుడు అవే కంపెనీలతో సేవల పెడుతున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా రేవంత్ బృందం ఒప్పందాలు చేసుకొన్న కొన్ని కంపెనీలు నెలల ముందే ప్రారంభమవ్వడం, వాటికి సరైన కార్యాలయాలు, సిబ్బంది కూడా లేకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. ఉదాహరణకు బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ్బయోతో రాష్ట్ర ప్రభు త్వం ఒప్పందం కుదుర్చుకొన్నది. రూ. వెయ్యి కోట్లను ఆ సంస్థ తెలంగాణలో పెట్టుబడిగా పెట్టనున్నట్టు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ డీల్ ఫలితంగా ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా మరో 250 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు తెలిపిం ది. కిందటినెలలోనే ఏర్పాటై, ఇద్దరు ఉద్యోగు లు కూడా లేని ఈ సంస్థ రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందన్న ప్రశ్న అందరిలో కలుగుతున్నది. పైగా ఈ కంపెనీ సీఎం రేవంత్ సోదరుడు జగదీశ్వర్‌రెడ్డికి చెందినది కావడం, ఆ విషయాన్ని ప్రభుత్వవర్గాలు దాచడం వివాదాన్ని రేపిం ది. ఇక, తెలంగాణలోని వీ-హబ్‌లో రూ.42 కోట్లు, వీ-హబ్‌లోని స్టార్టప్ కంపెనీల్లో మరో రూ.839 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి వాల్ష్ కార్రా హోల్డింగ్స్ అనే సంస్థ ముందుకొచ్చినట్టు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది.
నాలుగు నెలల కిందట ఏర్పడి, ఇప్పటివరకూ ఎలాంటి వార్షిక నివేదికలను విడుదల చేయని సదరు కంపెనీ అంత పెద్దమొత్తంలో పెట్టుబడులు ఎలా పెడుతుందన్న అనుమానాలు ప్రతిఒక్కరిలో కలుగుతున్నాయి. ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్న మరో రెండు కంపెనీల చరిత్ర కూడా సరిగ్గాలేదని పారిశ్రామిక నిపుణులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. రేవంత్ అమెరికా పర్యటన అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని, పెట్టుబడులు అన్నీ బోగస్‌గా మారాయని ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి వంటి వారు బహిరంగంగా విమర్శించడం చర్చనీయాంశమైంది. విస్తరణ పేరిట రేవంత్ ప్రభుత్వం మళ్లీ ఒప్పందం చేసుకోవడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా రేవంత్ అమెరికా పర్యటన ఓ ఫ్లాప్‌గా మారిందని సోషల్‌మీడియాలో పలువురు కామెంట్లు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చినవే
సీఎం అమెరికా పర్యటనలో భాగంగా చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసీయం, అమెజాన్, ఆరమ్ ఈక్విటీ, మోనార్క్ ట్రాక్టర్స్, కార్నింగ్ వంటి దిగ్గజ కంపెనీలతోనూ ఎంవోయూలు కుదిరాయని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొన్నది. రాష్ట్రం లో విస్తరణకు, కొత్తకేంద్రాలు నెలకొల్పేందుకు ఆయా కంపెనీలు సంసిద్ధం వ్యక్తం చేశాయని వెల్లడించింది. ప్రభుత్వం పేర్కొ న్న ఈ కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో సేవలు ప్రారంభించాయి. బీఆర్ఎస్ హ యాంలోనే పైన పేర్కొన్న కంపెనీలు ఒ ప్పందాలు చేసుకున్నాయి. డీల్‌లో భాగం గా విస్తరణ పనులు, కొత్త క్యాంపస్‌ల ఏర్పాటు చేస్తామని అప్పుడే ప్రకటించా యి. కేసీఆర్ హయాంలో వచ్చిన కంపెనీలతో ఇప్పుడు రేవంత్ సర్కారు ‘విస్తరణ పేరిట’ మళ్లీ ఒప్పందాలు చేసుకోవడం, వాటిని పెట్టుబడుల్లో చూపించడంపై నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.