Rythu Runa Mafi | రుణమాఫీకి నిధులెట్ల?.. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నది.
- 6 గ్యారంటీలను ఎలా అమలు చేయాలి?
- ఆదాయాన్ని పెంచుకోవడంపై ఫోకస్
- ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్
Rythu Runa Mafi | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను ఈ నెలాఖరులోగా ప్రవేశపెట్టాల్సి ఉండటంతో సంబంధిత అంచనాలను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తున్నది. దీనిలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో శాఖల వారీగా సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వ్యవసాయం, జౌళి, రెవెన్యూ తదితర శాఖలతో బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఉద్యోగుల జీతాలతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త నిర్ణయాలను తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.
రూ.28 వేల కోట్లకు చేరిన అప్పు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ నుంచి ఇప్పటివరకు రూ.28 వేల కోట్ల అప్పులు తెచ్చింది. ఈ నెలాఖరు నాటికి మొత్తం అప్పు రూ.31 వేల కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాల మాఫీ, రైతు భరోసా, 6 గ్యారంటీలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైనన్ని నిధులను బడ్జెట్లో కేటాయించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

