హైదరాబాద్, మార్చి31 (నమస్తే తెలంగాణ) : ఇరిగేషన్‌శాఖలో ఇకపై ఎ క్స్టెన్షన్లు ఉండబోవని ఘంటాపథంగా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఆచరణ లో మాత్రం దానిని ఉల్లఘించారు. ఇ ప్పటికే పలువురికి ఎక్స్టెన్షన్ ఇవ్వగా, తాజాగా మరో ఇద్దరు ఇంజినీర్ల సర్వీసును పొడిగించి సీనియర్లకు తీరని ద్రో హాన్ని తలపెట్టింది. ఈ మేరకు ఆ శాఖ సెక్రటరీ శ్రీధర్ మంగళవారం ఉత్తర్వు లు జారీచేశారు. తక్షణమే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అసోసియేషన్ వేర్వేరుగా డిమాండ్ చేశాయి.
ఈఎన్సీ(జనరల్) రమేశ్‌బాబు, ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓఅండ్ఎం) ఇన్చార్జి ఈఎన్సీ, ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్ మంగళవారం ఉద్యోగ విరమణ పొందాల్సి ఉన్నా ప్రభుత్వం మాత్రం వారి సర్వీస్‌ను కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈఎన్సీ జనరల్ శ్రీనివాస్ ఉద్యోగకాలాన్ని ఆరు నెలలు పొడిగించింది. వాస్తవంగా ఆయనది ఏపీ కేడర్. అదీగాక ఆయనకు ఈఎన్సీ జనరల్‌తోపాటు ఖమ్మం, సూర్యాపేట సీఈలుగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఉద్యోగ కాలాన్ని పొడిగించింది. సీఈ శ్రీనివాస్ సర్వీస్‌ను సైతం ప్రభుత్వం పొడిగించింది.